|

కృష్ణమ్మ చేరితేనే జలాభిషేకం

కోటప్పకొండలో ఎండిన చెరువులు
లక్షల మంది భక్తుల గొంతు తడపడం కష్టమే
కనిష్ఠ స్థాయికి సాగర్‌ జలమట్టం
పండగకు పది రోజుల ముందు నీరు వదిలితేనే పరిష్కారం

మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఈసారి తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఏటా తిరునాళ్లకు అయిదు లక్షలమందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ఈ లక్షలాది భక్తులకు కొండ సమీపంలో ఉన్న రెండు చెరువుల్లోని నీరే ఆధారం. ఎప్పుడైనా చెరువులు ఎండినా సాగర్‌ కాలువలకు నీరు వదిలి చెరువులు నింపేవారు. దీంతో కొండపై నీటి కష్టాలంటూ భక్తులు ఎరుగరు. ఫిబ్రవరి నెలలో పండుగ వచ్చినప్పుడు అంతగా నీటి కష్టాలు తలెత్తకపోయినా.. ఈసారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

మార్చి 7న పండగ రావడం.. ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల మధ్య నమోదవుతుండడం, కోటప్పకొండలోని రెండు చెరువులు పూర్తిగా ఎండిపోవడం.. బోర్లు వట్టిపోవడంతో ఇప్పటికే తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక సాగర్‌ జలాలతో చెరువులు నింపే అవకాశాలు రోజు రోజుకు మృగ్యమవుతున్నాయి. మార్చి ఏడో తేదీ నాటికి సాగరు కాలువ నిండా నీళ్లు ప్రవహించాలంటే ఈ నెల 25న జలాశయం నుంచి నీటి విడుదల చేయాల్సిందే. తాజాగా కృష్ణ యాజమాన్య బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం నాలుగు టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు ఇస్తున్నారు. మరి కుడి కాలువ పరిస్థితి ఏమిటన్నది ఇప్పటి వరకు నిర్ణయం లేదు.

క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. పండుగ నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మండుటెండల్లో తాగునీటి కష్టాలు యాత్రికుల సంఖ్యపైనా ప్రభావం చూపుతాయని ఆలయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కుడికాల్వ పరిధిలో చెరువులన్నీ నింపటానికి మన జిల్లాకు ఆరు టి.ఎం.సి.ల జలాలు కావాలని ఎన్‌.ఎస్‌.పి. అధికారులు అంచనా వేశారు. మరోవైపు ప్రకాశం జిల్లాకు నాలుగు టి.ఎం.సి.ల నీరు అవసరముంది. మొత్తం 10 టి.ఎం.సి.ల జలాలు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అవసరం. శ్రీశైలం నుంచి సాగరు జలాశయానికి నీళ్లు విడుదల చేస్తే మార్చి 1 నుంచి బుగ్గవాగు నింపుకొని 10 లేదా 15వ తేదీ నుంచి తాగునీటి చెరువులు నింపాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం మీద ఒక్కసారే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తేల్చి చెబుతున్నారు. పండుగ మార్చి 7న కాబట్టి అధికారులు ముందుగా సాగర్‌కు నీళ్లు తెచ్చుకోవాలి.. బుగ్గవాగు నింపాలి. కోటప్పకొండ వద్ద ఉన్న చిలకలూరిపేట మేజరుకు నీళ్లు రావాలి.. అప్పుడు గానీ కొండ వద్ద ఉన్న రెండు చెరువులను నింపలేరు. ఈ రెండు చెరువులు నిండితేనే దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల స్నానాలకు నీళ్లు అందుబాటులోకి వస్తాయి. రెండు జిల్లాలకు కలిపి పది టి.ఎం.సి.లు కావాలంటే ఇవ్వడం సాధ్యం కాదని యాజమాన్య బోర్డు కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెబుతున్నారు.

నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులే..! కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే లక్షలాది భక్తులను తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలంటే అధికారులు తక్షణం నిర్ణయం తీసుకోవలసి ఉంది. మార్చి పదో తేదీన నీళ్లు ఇస్తామంటే భక్తులకు ఇబ్బందులు తప్పవు. కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించి అధికారిక సమావేశం ఇప్పటికే ఒకసారి నిర్వహించారు. ఇప్పుడు ప్రత్యేకంగా తాగునీటి అంశంలో అధికారులు నిర్ణయం తీసుకొని కృష్ణమ్మను త్రికోటేశ���వరుని సన్నిధికి చేరిస్తే పండగ సంబరాలు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఈ విషయంలో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాల్సి ఉంది.

కోటప్పకొండ ధర్మకర్తల మండలి నియామకం

జిల్లాలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధర్మకర్త ఎంవీఆర్‌ కొండలరావు, చెరుకూరి ప్రసాద్‌, గుడిపూడి నాగభూషణం, అనుమోలు వెంకయ్య చౌదరి, బెల్లంకొండ పిచ్చయ్య, కొర్నెపాటి సుబ్బారావు, మండవ లీలా వెంకట శ్రీనివాసరావు, రమణపాటి భాగ్యలక్ష్మి, కొత్తూరి రామసుబ్బరాయుడు, ఎక్స్‌అఫీషియో సభ్యునిగా ముఖ్యఅర్చకుడు ఆర్‌.కిరణ్‌కిశోర్‌ శర్మను నియమించారు. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించి నాటి నుంచి కాలపరిమితి వర్తిస్తుందని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. 

కోటప్పకొండపైకి పురాతన మెట్ల మార్గం

గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయానికి చేరుకునే పురాతన మెట్ల మార్గం బయటపడింది. కొండ కింద నుంచి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుకు పనులు చేపట్టిన సందర్భంలో శిథిలావస్థలో ఉన్న మెట్లు బయటపడ్డాయి. తాగునీటి ఎద్దడి నివారణకు కొండ కింద సంపు నిర్మించి కొండపైకి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొండపైకి పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ముళ్ళ పోదలను తొలగిస్తుండగా ఇవి కనిపించాయి. కమ్మజన సంఘం సత్రం వెనుక వైపు నుంచి నేరుగా కొండమీదకు వెళ్ళే విధంగా కొండ రాళ్ళను మెట్లుగా అమర్చారు.

వంద ఏళ్ల కింద వాడారు..
సోపాన మార్గంలో మెట్లను అభివృద్ధి చేసిన తరువాత ఈ దారి ఎవరూ వినియోగించక పోవడంతో.. ఈ ప్రాంత మంతా ముళ్ళ పోదలతో నిండిపోయింది. భక్తులు కోటప్పకొండకు చేరుకునేందుకు రెండు మెట్ల మార్గాలు ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బయటపడిన మార్గంతో పాటు డిఆర్‌డిఎ శిక్షణా కేంద్రం వెనుక వైపు నుండి మరో మార్గం ఉండేది. ఈ దారిని ఏనుగుల దారి అంటారు. కొండమీదకు అవసరమైన సామాగ్రిని ఏనుగుల ద్వారా కొండమీదకు తరలించే వారని చెబుతారు. అయితే తరువాత కాలంలో త్రికోటేశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్టీలుగా ఉన్న నరసరావుపేట జమీందార్లు నూతనంగా సోపాన మార్గం నిర్మించారు.

దీంతో ఈ మార్గం గుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాలక్రమంలో గతంలో ఉన్న రెండు మెట్ల మార్గాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు బయటపడి న మెట్ల మార్గం పూర్తిగా కొండపైకి లేదు. కొండపైన అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన విస్తరణ పనుల్లో ఈ మార్గం మూతబడిపోయింది. కొండపైన ఇప్పుడు ఉన్న క్యాంటిన్ వెనక కొండరాళ్ళతో నింపి విస్తరించడంతో మెట్ల మార్గం దాని కిందకు వెళ్ళిపోయింది. బయటపడిన మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం లేదని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

భక్తులకు ఇబ్బంది కలగొద్దు!

సమన్వయంతోనే సాధ్యమన్న సభాపతి
 రాకపోకలపై ప్రత్యే దృష్టి: కలెక్టర్‌
మహాశివరాత్రి తిరునాళ్లపై తొలి సమీక్ష

రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ తిరునాళ్ల మహాశివరాత్రి పర్వదినాన అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని శాసన సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు అన్నారు. బుధవారం రాత్రి త్రికోటేశ్వరుని సన్నిధిలో తిరునాళ్లకు సంబంధించిన తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్టీసీ, పంచాయతీరాజ్‌, విద్యుత్తు, అటవీశాఖ, ఎన్నెస్పీ, జిల్లాపరిషత్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, అగ్నిమాపక, డీఆర్‌డీఏ, వైద్యఆరోగ్యశాఖ, పురపాలకసంఘాలకు చెందిన అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని.. క్రమశిక్షణ పాటించడంతోపాటు ప్రణాళికాయుతంగా పనిచేయాలన్నారు. కొండ అభివృద్ధికి పర్యాటక శాఖ రూ.4.5 కోట్లు మంజూరుచేసిందని, అటవీ, పర్యాటక శాఖలు కలిసి కోటప్పకొండను హరితవనంగా తీర్చిదిద్దాలన్నారు. తిరుమల నుంచి 10 వేల మొక్కలు ఉచితంగా వస్తున్నాయని, వాటితో కొండను తీర్చిదిద్దాలన్నారు. పండుగ రోజు ప్రసాదాలను పంపిణీ చేసే స్వచ్చంద సంస్థలు, భక్త సమాజాల ప్రతినిధులను ఓ ప్రణాళికతో చోటు కేటాయించాలని.. ఎక్కడ బడితే అక్కడ పంపిణీ ఉండకూడదన్నారు. కొండదారిలో ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చూసుకోవాలని చెప్పారు. ఉన్నతస్థాయి అధికారులకు తప్ప మిగతావారి వాహనాలను అనుమతించవద్దని స్పష్టం చేశారు. దేవస్థానంలో తయారు చేసే ప్రసాదాలను నాణ్యతగా చేయాలని సూచించారు.

బాద్యతలు సక్రమంగా నిర్వహించాలి:కలెక్టర్‌
మహాశివరాత్రికి కోటప్పకొండలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో మెలగాలని కలెక్టర్‌ కాంతిలాల్‌దండే అన్నారు. మూడు నెలలు సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే పనులు చేపట్టాలన్నారు. గతేడాది కొండపైకి వెళ్లాలన్నా.. కిందికి రావాలన్నా తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. తాను గుంటూరుకు వెళ్లాలంటే మూడున్నరగంటలు పట్టిందని.. ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ఏ శాఖకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లేనందున దేవదాయశాఖనుంచి వచ్చే నిదులు ఖర్చు చేయాలని ప్రస్తావించారు. అయితే దేవస్థాన ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవదాయశాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు ఉంటే తప్ప తాను స్వయంగా నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. దీనిపై సభాపతి స్పందించి దేవాదాయశాఖకు వచ్చే నిధులు ఖర్చు పెట్టుకునేందుకు అనుమతివ్వాలని కమిషనర్‌ను కోరతామన్నారు. జడ్పీ సీఈవో సుబ్బారావు మాట్లాడుతూ పారిశుద్ధ్యం విషయంలో సిబ్బందిని పెంచుతామన్నారు. ఆర్టీసీ అధికారి జ్ఞానంగారి శ్రీహరి మాట్లాడుతూ బస్సుల ఏర్పాటుకు ఇబ్బందులు లేవని, మంచి బస్సులు ఇస్తామన్నారు. డీఎస్పీ నాగేశ్వరరావు, ఆర్టీవో ఎం.శ్రీనివాసరావు, లింగంగుంట్ల సర్కిల్‌ ఎస్‌ఈ ఎంవీ కృష్ణారావు, విద్యుత్తుశాఖ ఎస్‌ఈ జయభారతరావు, డీఎంహెచ్‌ఓ డాక్టరు పద్మజారాణి, అటవీశాఖాధికారి లోహితాసుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జీ శర్మ, సమాచారశాఖ అధికారులుకిరణ్‌, పూర్ణచంద్రరావు, ఎంపీడీవో బాలూనాయక్‌, తహశీల్దార్‌ లీలాసంజీవకుమారి తదితరులు పాల్గొన్నారు.


కోటప్పకొండకు రూ.3.5కోట్ల నిధులు

ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కోటప్పకొండలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పర్యాటక శాఖాపరంగా చేయటానికి రూ.3.5కోట్లతో తాజాగా టెండర్లు పిలిచారు. కోటప్పకొండను అద్భుతంగా తయారు చేయాలన్న లక్ష్యంతో శాసన సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. పర్యాటక శాఖాధికారులను పలుమార్లు కొండకు పిలిపించి స్వయంగా చూపించారు. ఈ నేపథ్యంలో కొండ కింద నుంచి పైకి రోప్‌వే(తీగమార్గం) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆశాఖాధికారులు తీగమార్గం ఏర్పాటు చేయటానికి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. రూ.7కోట్ల నిధులు దీని కోసం ఖర్చు చేయబోతున్నారు. పీపీపీ విధానంలో దీనిని ఏర్పాటు చేస్తారు. మరోవైపు కొండ కింద పైన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. 

కొండ కింద విశ్రాంతి గదుల భవన సముదాయం, ఫ¾లహారశాల, ఫుడ్‌కోర్డు ఏర్పాటు చేస్తారు. కొండపైన తీగమార్గంలో దిగే ప్రయాణికుల విశ్రాంతి కోసం పెద్దభవనాన్ని నిర్మించబోతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పర్యాటక క్షేత్రాన్ని విస్తరింప చేస్తున్నారు. మరోవైపు కొండపైకి వచ్చే యాత్రికుల అవసరాల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో 2 లక్షల నీటి నిల్వ సామర్థ్యంతో సంపు, పైపులైను నిర్మాణానికి రూ.28లక్షల నిధులు వ్యయం చేయబోతున్నారు. భక్తులకు మహాశివరాత్రి నాడే కాకుండా వేసవిలో తాగు నీటికి ఇబ్బంది లేకుండా చేస్తారు. మరో వైపు దేవస్థానం ముఖమండపం ఎదురుగా ఉన్న త్రిముఖ లింగాకారాన్ని తొలగించి స్థలాన్ని విస్తరించాలని నిర్ణయించారు. స్థలవిస్తరణ తర్వాత మళ్లీ త్రిముఖలింగాకారాన్ని మరలా నిర్మిస్తారు.గొల్లభామ దేవస్థానం వద్ద నుంచి సరాసరి పైకి మెట్లు కూడా నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. దీని రూ.1.20కోట్ల నిధులు వ్యయమవుతాయని అంచనా. ఆదివారం సాంకేతిక నిపుణులు పరిశీలన చేశారు. పర్యాటకశాఖ, భవనాలన్నీ మార్చి 31 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. తితిదే ఆధ్వర్యంలో వేదపాఠశాల యాత్రికుల విశ్రాంతి భవనం నిర్మాణం పనులు సాగుతున్నాయి.


Volume_II-Project-Information-Memorandum-for-Ropeway-at-Kotappakonda_F.pdf (1.4MB)

వైభవంగా ఆరుద్రోత్సవం

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ త్రికోటేశ్వరునికి అత్యంత వైభవంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి తరవాత ప్రారంభమైన కార్యక్రమం శనివారం ఉదయం 7.30 గంటలకు అన్నాభిషేకంతో పూర్తయ్యింది. పాత కోటేశ్వరుని ఆలయం వద్ద కర్పూర జ్యోతి దర్శనంతో ఆరుద్రోత్సవం ప్రారంభమైంది. క్షీరం, జలం, దది, నెయ్యి, తేనె, పంచదార, శుష్కఫలాలు, విబూది, గంధం, పళ్లరసాలు, తైలం, అన్నాభిషేకం సుగంధ ద్రవ్యాభిషేకాలతో వేదమంత్రోఛ్చరణ మధ్య తెల్లవార్లు సాగిన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం భక్తులను పులకింపజేసింది.

దేవస్థాన సహాయ కమిషనర్‌ డీ.శ్రీనివాసరావు పర్యవేక్షణలో అర్చకులు కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి యాగశాలలో మేథాదక్షిణామూర్తి, లక్ష్మీ గణపతి, చండీ, రుద్ర, నవగ్రహ హోమాలనంతరం పూర్ణాహుతి చేశారు. మేథాదక్షిణామూర్తి మాలధారులు సుమారు 700 మంది స్వామిని దర్శించుకుని దీక్ష విరమణ చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మాలధారులు పాదయాత్రగా వచ్చారు. తాళ్ల వెంకటకోటిరెడ్డి, శీలం శ్రీధర్‌రెడ్డి, అల్లూ రమేశ్‌ హాజరైన భక్తులకు అన్నదానం చేశారు.

కోటప్పకొండలో గవర్నర్ ప్రత్యేక పూజలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండలో వెలసిన శ్రీత్రికోటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.


TTD VEDAPATHASHALA TO GET READY BY 2016 – TTD CHAIRMAN

VEDAS ARE IDENTITY OF OUR SANATANA DHARMA-AP ASSEMBLY SPEAKERKOTAPPAKONDA VEDAPATHASHALA TO BECOME IDEAL FOR VEDIC STUDIES-MINISTER

“Vedas are the essence of our Sanatana Dharma and there is need to promote and preserve the tenets for future generations by encouraging Vedic education”, said Honourable Speaker of AP Assembly Dr K Siva Prasad.

The dignitary participated in the inauguration of TTD-run Veda Pathashala at Kotappakonda in Guntur district along with AP Labour Minister Sri Acchennaidu and TTD Trust Board Chairman Dr Ch Krishnamurthy on Sunday.

Speaking on this occasion, he complimented TTD for its initiative in promoting Vedic knowledge by establishing Vedic schools, universities, trust etc. “There is need to take up more and more activities to promote our Vedic knowledge”, he added.

Meanwhile Minister Sri Acchennaidu said, Kotappakonda will soon emerge as knowledge hub for Vedas. “Today history has been written by opening up the Vedic school here and very soon it will become ideal to Vedic Studies”, he asserted.

In his speech, TTD Chairman said, TTD has released Rs.4.15cr towards the construction of Vedic school, hostel and quarters while another Rs.4.65cr for Pilgrim amenities complex and Rs.74lakhs towards setting up two massive statues of Lord Brahma and Lord Vishnu in the Pathashala premises. “All these works will be completed in next four months time. I am confident that Kotappakonda will emerge as an ideal Vedic institution in the country”, he maintained.


Kotappakonda to Turn 'Tourist Haven'

The famous hill shrine of Trikuteswara atop the Kotappakonda in Guntur district witnesses lakhs of devotees during ‘Maha Sivaratri’. But on normal days, though it has much to offer to tourist year around, there are lesser takers.

In a bid to change this and ensure that Kotappakonda comes alive with tourists and pilgrims, efforts are being made to make the place a ‘tourist haven’ and make the tourists visit again and again. It is not just the endowments or tourism department, but every department is chipping in and taken up projects worth several crores, which are nearing completion.

According to the temple officials, the devasthanam with the help of endowments department has taken up beautification works at the cost of Rs 2.86 crore. The flooring of the temple premises has been changed with non-slippery tiles. In front of the temple entrance, the moving area has been extended and the area between Lord Ganesha statue and Gollabhama temple have been fortified with railing and a pathway of 17-foot width having interlocked bricks has been developed. Pilgrims visiting the place can have an unhindered view of the scenery from the place.

To facilitate those trekking to the hill shrine from foothills, a 40 feet shed covered with galvanised sheets is under construction. The exit area on the north side of the temple is being extended. ‘Pravachana Mandap’, ‘Yagasala’ and ‘Navagraha Mandapam’ are under construction. “We are also constructing a pilgrim hall, ‘Potu’ (temple kitchen), ‘prasadam’ counters and coconut breaking points,” explained temple executive officer D Srinivas Rao.

He added that a proposal for constructing a 300 m-long ropeway from foothills to the hill shrine will be taken up under public-private partnership mode and the works are expected to be completed in a year.

Tirumala Tirupati Devasthanams (TTD) has chipped in for the development of the region and is setting up a ‘Veda Pathasala’ aside from a pilgrim amenities complex with more than Rs 10 crore.

The forest department, on its part, has taken up development of the ghat section by working in tandem with the road and buildings department. An eco-park and a children park have also been constructed, which have giant working models of dinosaurs. The R&B, on its own, is constructing an island and waterfalls, while the tourism department is engaged in constructing Pagoda-style waiting halls and the RWS department has undertaken the beautification works of the temple.

Once all the works are completed, the temple will emerge as a major tourist attraction, much near to the proposed capital city on the banks of River Krishna in Thullur, the temple officials hoped.